భారతదేశం, ఏప్రిల్ 7 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 787 పాయింట్లు పెరిగి 74,107 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 255 పాయింట్లు వృద్ధిచెంది 22,968 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1060 పాయింట్లు పెరిగి 52,609 వద్దకు చేరింది.

అమెరికా- ఇరాన్​కి ముందు కాల్పుల విరమణ ప్రతిపాదన వెళ్లిందన్న వార్తలతో దేశీయ స్టాక్​ మార్కెట్​లతో పాటు ప్రపంచ సూచీలు నెగిటివ్​ నుంచి పాజిటివ్​కి మారాయి. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్​ తిరస్కరించిందని ప్రస్తుతం మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,167.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,088.70 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెష...