భారతదేశం, మార్చి 25 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1376 పాయింట్లు పెరిగి 74,068 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 400 పాయింట్లు వృద్ధిచెంది 22,912 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1168 పాయింట్లు పెరిగి 52,606 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,009.56 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,867.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 225 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెర...