భారతదేశం, ఏప్రిల్ 22 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 753 పాయింట్లు పెరిగి 79,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 212 పాయింట్లు వృద్ధిచెంది 24,577 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 789 పాయింట్లు పెరిగి 57,371 వద్దకు చేరింది.

కాగా అమెరికాతో రెండో దఫా చర్చలను ఇరాన్ తిరస్కరించడం కారణంగా ప్రపంచ స్టాక్​ మార్కెట్​లలో ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,918.99 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,221.27 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 165 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"టెక్నిక...