భారతదేశం, జూన్ 30 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 372 పాయింట్లు పడి 76,728 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 110 పాయింట్లు కోల్పోయి 23,946 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 450 పాయింట్లు పడి 57,272 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,350.10 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,801.45 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 24,250 లెల్స్​ దాటికే బయ్యర్లకు మరింత కన్విక్షన్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి సూచీ 24,400- 24,600 లెవల్స్​ వరకు వెళ్లొచ్చు. 200 ...