భారతదేశం, ఆగస్టు 27 -- బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 183 పాయింట్లు పడి 77,473 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 127 పాయింట్లు కోల్పోయి 24,208 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 267 పాయింట్లు పెరిగి 57,784 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 502.63 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,425.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 24,115 సపోర్ట్​ లెవెల్​గా ఉండనుంది. ఇది బుధవారం నాటి ఇంట్రాడే లో. దీని కన్నా దిగువకు పడితే సూచీ 24,000- 24,040 వరకు వెళ్లొచ...