భారతదేశం, ఏప్రిల్ 21 -- Gift nifty live : సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 27 పాయింట్లు పెరిగి 78,520 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 11 పాయింట్లు వృద్ధిచెంది 24,365 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 56,582 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,059.93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,966.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50.. 50-డే ఈఎంఐ దగ్గర కన్సాలిడేషన్​ అవుతోంది. హయ్యర్​ హై- హయ్యర్​ హై పాటర్న్​ని ఏర్పాటుచేస్తోంది. నిఫ...