భారతదేశం, మార్చి 17 -- ఇరాన్​- ఇజ్రాయెల్​, యూఎస్​ అనిశ్చితి మధ్య గత వారం అత్యంత భారీగా పతనమైన దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో కాస్త తేరుకున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 939 పాయింట్లు పెరిగి 75,503 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 258 పాయింట్లు వృద్ధిచెంది 23,409 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 656 పాయింట్లు పెరిగి 54,413 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 9,365.52 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,593.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ మార్చ్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 66,248.74 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 83,120.06 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ...