భారతదేశం, ఏప్రిల్ 24 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 852 పాయింట్లు పడి 77,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 205 పాయింట్లు కోల్పోయి 24,173 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 819 పాయింట్లు పడి 56,305 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,255 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 941 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"టెక్నికల్​గా చూసుకుంటే నిఫ్టీ50కి 23,950- 24,000 లెవల్స్​ వద్ద కీలక సపోర్ట్​ ఉంది. 24,350- 24,400 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది," అని చా...