భారతదేశం, ఆగస్టు 18 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 281 పాయింట్లు పడి 77,728 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 78 పాయింట్లు కోల్పోయి 24,288 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 7 పాయింట్లు పెరిగి 57,498 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,535.10 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,101.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 75 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.50 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500...