భారతదేశం, జూన్ 23 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 291 పాయింట్లు పెరిగి 77,094 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 90 పాయింట్లు వృద్ధిచెంది 24,103 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 250 పాయింట్లు పెరిగి 57,936 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 635.91 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,035.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 23,700 లెవల్స్​ బ్రేక్​ చేయనంత వరకు బై ఆన్ డిప్స్​ స్ట్రాటజీని అనుసరించాలని సూచిస్తున్నాము. సూచీకి 24,450- 24,600 లెవల్స్​ వద్ద...