భారతదేశం, మార్చి 16 -- ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా మధ్య అనిశ్చితి కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లో బ్లడ్​ బాత్​ కొనసాగుతోంది. గత వారం రోజుల్లో సూచీలు అతి భారీ నష్టాలను చూశాయి. మరీ ముఖ్యంగా శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1470 పాయింట్లు పడి 74,564 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 488 పాయింట్లు పతనమై 23,151 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1343 పాయింట్లు కోల్పోయి 53,758 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా గందరగోళం మొదలవ్వకముందు, అంటే ఫిబ్రవరి 27 సెన్సెక్స్​ సుమారు 81,200 వద్ద, నిఫ్టీ50 25,170 దగ్గర ఉండేవి.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 10,716.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,977.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశార...