భారతదేశం, జూన్ 5 -- Gift nifty live : గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 14 పాయింట్లు పెరిగి 74,360 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. కేవలం 11 పాయింట్లు వృద్ధిచెంది 23,417 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 54,308 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,447.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,360.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్​ ఆఫ్​ రీసెర్చ్, వెల్త్​ మేనేజ్​మెంట్​ సిద్ధార్థ ఖేంక ప్రకారం.. "భ...