భారతదేశం, అక్టోబర్ 22 -- బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 143 పాయింట్లు పడి 73,710 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 78 పాయింట్లు కోల్పోయి 22,811 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 511 పాయింట్లు పడి 54,977 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,022.32 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,614.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 తన 20డీఎంఏ రేంజ్​లో తిరుగుతోంది. కానీ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్​ పాటర్న్ మాత్రం కొనసాగుతోంది. 22,720 కీలక సపోర్ట్​ జోన్​ని సూచీ తట్టుక...