భారతదేశం, మే 11 -- Sensex today : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 516 పాయింట్లు పడి 77,328 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 150 పాయింట్లు కోల్పోయి 24,176 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 737 పాయింట్లు పడి 55,311 వద్దకు చేరింది.

కాగా.. యుద్ధం ముగింపు, చమురు సరఫరా పునరుద్ధరణ కోసం ఇరాన్- అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలం అయ్యాయన్న వార్తలు తాజాగా కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాలతో ముడి చమురు ధర భారీగా పెరిగింది. స్టాక్​ మార్కెట్​లో అనిశ్చితి నెలకొంది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,110.60 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,748.13 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మా...