భారతదేశం, ఏప్రిల్ 10 -- అమెరికా- ఇరాన్​ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో బుధవారం భారీగా లాభపడిన దేశీయ స్టాక్​ మార్కెట్​లు, అదే కాల్పుల విరమణపై అనిశ్చితి కారణంగా గురువారం భారీగా నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 931 పాయింట్లు పడి 76,632 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 222 పాయింట్లు పతనమై 23,775 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 882 పాయింట్లు కోల్పోయి 54,822 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,711.19 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 955.90 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"టెక్నికల్​ పరంగా నిఫ్టీ50కి 23,920- 24,000 లెవల్స్​ ...