భారతదేశం, ఏప్రిల్ 8 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 510 పాయింట్లు పెరిగి 74,617 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 155 పాయింట్లు వృద్ధిచెంది 23,124 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 107 పాయింట్లు పెరిగి 52,716 వద్దకు చేరింది.

ఇరాన్​తో యుద్ధాన్ని రెండు వారాలు నిలిపివేస్తూ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఫలితంగా, ముడి చమురు ధరలు అతి భారీగా పడ్డాయి. అదే సమయంలో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో దూసుకెళుతున్నాయి.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,692.11 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,979.50 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్క...