భారతదేశం, నవంబర్ 6 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 2009 పాయింట్లు పెరిగి 79,310 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 576 పాయింట్లు వృద్ధిచెంది 24,537 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1860 పాయింట్లు పెరిగి 57,774 వద్దకు చేరింది.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు చెందిన రిపబ్లికెన్ పార్టీ ఓటమి, ముడి చమురు ధరలో భారీ పతనం కారణంగా భారత స్టాక్​ మార్కెట్​లు గురువారం విపరీతంగా లాభాలను చూశాయి.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 14,974.68 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,444.54 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్...