భారతదేశం, మార్చి 10 -- ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా అనిశ్చితుల మధ్య సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1353 పాయింట్లు పడి 77,566 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 422 పాయింట్లు కోల్పోయి 24,028 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1763 పాయింట్లు పడి 56,010 వద్దకు చేరింది.

ఒకానొక సమయంలో సూచీలు మరింత దారుణంగా పడ్డాయి. నిఫ్టీ50 దాదాపు 700 పాయింట్లు వరకు డౌన్​ అయ్యింది. కాగా కింది స్థాయిలు నుంచి కొనుగోళ్లు కనిపించాయి.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 6,345.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,013.8 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ మార్చ్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 28,176.76 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అద...