భారతదేశం, ఆగస్టు 13 -- బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 188 పాయింట్లు పడి 77,966 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 36 పాయింట్లు కోల్పోయి 24,436 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 4 పాయింట్లు పెరిగి 57,886 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,002.50 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,841.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"24,400 ఎగువన నిఫ్టీ50 ఉన్నంత వరకు రికవరీ జరుగుతున్నట్టే. 24,500- 24,550 బ్రేక్ అయితే, సూచీ మరింత పెరగొచ్చు," అని చాయిస్​ బ్రో...