భారతదేశం, జూలై 10 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 238 పాయింట్లు పెరిగి 76,742 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 81 పాయింట్లు వృద్ధిచెంది 23,963 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 510 పాయింట్లు పెరిగి 57,253 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 532.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,057.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 105 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 కన్సాలిడేషన్ దశకు చేరుకుంది. సూచీకి 23,650- 23,800 జోన్ కీలక సపోర్ట్​గా ఉంది. 24,150- 24,400 జోన్ రెసిస్టెన్స్​గా ఉంద...