భారతదేశం, నవంబర్ 13 -- గత వారం రోజులుగా కొనసాగి భారీ ర్యాలీ అనంతరం.. గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 32 పాయింట్లు పెరిగి 81,911 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 44 పాయింట్లు వృద్ధిచెంది 25,299 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 726 పాయింట్లు పెరిగి 61,518 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 7,830.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,331.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50లో పాజిటివ్ ట్రెండ్​ కొనసాగుతోంది. సూచీకి 25,000- 25,150 వద్ద కీలక సపోర్ట్ ...