భారతదేశం, అక్టోబర్ 9 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ ఏకంగా 1045 పాయింట్లు పడి 71,593 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 371 పాయింట్లు కోల్పోయి 22,232 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 540 పాయింట్లు పడి 54,515 వద్దకు చేరింది.

అమెరికా- ఇరాన్ యుద్ధం, చమురు ధరలు పెరగడం, రూపాయి పతనం, ఇండియాలో ఏఐపై పురొగతి లేకపోవడం వంటి అంశాలు మార్కెట్లను కిందకు పడేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 12,943.58 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,703.11 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 115 పాయి...