భారతదేశం, నవంబర్ 17 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 512 పాయింట్లు పెరిగి 82,105 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 147 పాయింట్లు వృద్ధిచెంది 25,291 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 542 పాయింట్లు పెరిగి 61,576 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో డీ​ఐఐలు రూ. 3,519.05 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో ఎఫ్ఐఐలు రూ. 4,864.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 3 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 25,300- 25,400 జోన్​ వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. అది దాటిన తర్వాత సమయంలో 25,900- 26,000 జోన్ వరకు వెళ్లే అవకాశం ఉంది. 25...