భారతదేశం, ఆగస్టు 10 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 463 పాయింట్లు పడి 78,491 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 65 పాయింట్లు కోల్పోయి 24,571 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 317 పాయింట్లు పడి 57,746 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 480.24 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 235.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50లో వీక్​నెస్ కనిపిస్తోంది. 24,400- 24,300 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్​ ఉంది. 24,700 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరి...