భారతదేశం, నవంబర్ 26 -- బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1502 పాయింట్లు పెరిగి 83,938 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 470 పాయింట్లు వృద్ధిచెంది 25,819 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1118 పాయింట్లు పెరిగి 63,703 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,479.08 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,018.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 165 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 పాజిటివ్​ ట్రెండ్​లో దూసుకెళుతోంది. ప్రస్తుతం సూచీకి 25,550- 25,600 లెవల్స్​ వద్ద కీలక సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే స...