భారతదేశం, నవంబర్ 9 -- దీపావళి నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు పడింది. ఇక ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయింది. అయితే శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో మాత్రం దేశీయ స్టాక్​ మార్కెట్​లు దుమ్మురేపాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1718 పాయింట్లు పెరిగి 81,028 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 494 పాయింట్లు వృద్ధిచెంది 25,030 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1312 పాయింట్లు పెరిగి 59,086 వద్దకు చేరింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కి చెందిన రిపబ్లికెన్ పార్టీ ఓటమి, ఏఐపై డెమొక్రాట్ల వ్యతిరేక వైఖరి వంటివి దేశీయ స్టాక్​ మార్కెట్​ అప్​ట్రెండ్​లో దూసుకెళ్లడానికి కారణం అవుతున్నాయి.

ముహూరత్ ట్రేడింగ్​ సెషన్​లో ఎ...