భారతదేశం, జూలై 3 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 579 పాయింట్లు పెరిగి 77,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 170 పాయింట్లు వృద్ధిచెంది 24,176 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 1 పాయింట్ పడి 58,032 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 311.82 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,784.40 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 182 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 1.1 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.01 శ...