భారతదేశం, జూలై 2 -- బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 444 పాయింట్లు పెరిగి 76,923 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 140 పాయింట్లు వృద్ధిచెంది 24,006 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 490 పాయింట్లు పెరిగి 58,033 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,140.50 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,159.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.03 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.22శాతం ప...