భారతదేశం, ఏప్రిల్ 27 -- అమెరికా- ఇరాన్​ మధ్య అనిశ్చితి నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 983 పాయింట్లు పడి 76,681 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 275 పాయింట్లు కోల్పోయి 23,898 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 215 పాయింట్లు పడి 56,090 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,828 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,701 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 185 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా భారత ఈక్విటీ మార్కెట్లు ఒడుదొడుకులకు గురయ్యే అవకాశం ఉంది. స్...