భారతదేశం, నవంబర్ 24 -- గురు నానక్ దేవ్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం (నవంబర్ 24) భారత స్టాక్ మార్కెట్​లకు సెలవు. దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్​ఛేంజీలైన బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్​ (ఎన్​ఎస్​ఈ) నేడు ఈక్విటీ ట్రేడింగ్‌ను పూర్తిగా నిలిపివేశాయి.

మల్టీ-కమోడిటీ ఎక్స్​ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎంసీఎక్స్) నేడు రెండు విభాగాలుగా పనిచేస్తోంది. ఎంసీఎక్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే మార్నింగ్ సెషన్‌లో ట్రేడింగ్ నిలిపివేశారు. అయితే సాయంత్రం 5 గంటలకు ఎక్స్​ఛేంజ్ తిరిగి తెరుచుకుంటుంది. రాత్రి 11:30 గంటల వరకు ఈవెనింగ్ సెషన్ ట్రేడింగ్ యథావిధిగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలకు అనుగుణంగా బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ కాంట్రాక్టులలో ట్రేడింగ్ చేసే వారికి సాయంత్...