భారతదేశం, జూలై 13 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 828 పాయింట్లు పెరిగి 77,569 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 244 పాయింట్లు వృద్ధిచెంది 24,207 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 793 పాయింట్లు పెరిగి 58,046 వద్దకు చేరింది.

కాగా.. వారాతంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి! అమెరికా- ఇరాన్ దేశాలు మరోసారి పరస్పర దాడులకు దిగాయి. ఫలితంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్​ని మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రపంచ స్టాక్​ మర్కెట్​లు మరోసారి కుదేలయ్యాయి.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,603.72 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,019.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ...