భారతదేశం, మే 26 -- US Iran War news : చమురు ధరలు డౌన్ అవ్వడంతో సోమవారం ట్రేడింగ్​​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1074 పాయింట్లు పెరిగి 76,489 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 312 పాయింట్లు వృద్ధిచెంది 24,032 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1238 పాయింట్లు పెరిగి 55,294 వద్దకు చేరింది.

కాగా మంగళవారం ఉదయం ఇరాన్​పై అమెరికా దాడులు జరిపింది. ఫలితంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఈ పరిణామాల మధ్య ముడి చమురు ధర అమాంతం పెరిగింది, స్టాక్​ మార్కెట్​లలో భయాలు పెరిగాయి.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 821.75 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,856.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​...