భారతదేశం, జూలై 7 -- షేర్ మార్కెట్ అనగానే చార్టులు, ఫైనాన్షియల్ రేషియోలు, ఎకనామిక్ డేటా, రకరకాల విశ్లేషణలు గుర్తుకొస్తాయి. కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి ఇదంతా పెద్ద గందరగోళంగా అనిపించవచ్చు. కానీ, స్టాక్ మార్కెట్లో విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి పెట్టుబడిదారులు అనుసరించిన సాధారణ, క్రమశిక్షణతో కూడిన మార్గాలనే మనం ఇక్కడ తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్ పెట్టుబడి అంటే ప్రతిరోజూ షేర్లను కొనడం, అమ్మడం లేదా మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేయడం కాదు. ఒక మంచి కంపెనీలో భాగస్వామి అవ్వడమే పెట్టుబడి అసలు ఉద్దేశం. ఈ కోణంలో ఆలోచిస్తే మార్కెట్ చాలా సులభంగా అర్థమవుతుంది.

ప్రస్తుతం భారతదేశంలో రీటెయిల్ ఇన్వెస్టర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల పుణ్యమా అని దేశంలో 11 కోట్లకు పైగా యునిక్ ఇన్వెస్టర్లు, 21 కోట్లకు ప...