భారతదేశం, మే 28 -- Steven Spielberg AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీపై హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg) సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జాస్', 'ఈ.టీ.', 'ఇండియానా జోన్స్', 'షిండ్లర్స్ లిస్ట్', 'లింకన్' వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిన ఆయన.. సినిమా నిర్మాణంలో AI ప్రమేయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మిషెల్ ఒబామా, క్రెయిగ్ రాబిన్సన్‌లు సంయుక్తంగా నిర్వహించే "IMO" పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న స్పీల్‌బర్గ్.. క్రియేటివ్ రంగంలో AI పరిమితులపై తన గళాన్ని విప్పారు.

సినిమా రంగంలో AI వాడకంపై స్పీల్‌బర్గ్ వ్యక్తపరిచిన ప్రధాన అభ్యంతరాలు ఇవే.

మనిషికి అల్గారిథమ్ సాటిరాదు: మనుషుల భావోద్వేగాలకు, వారి అంతరాత్మకు ప్రత్యామ్నాయం అంటూ ఏదీ ఉండదని, దాన్ని ఒక కంప్యూటర్ అల్గారిథమ్‌తో సృష్టించలేమని ఆయన స్పష్టం చేశారు.

రచయితల...