భారతదేశం, ఏప్రిల్ 15 -- Step-up: భారతదేశం ఇప్పుడు 'ఎస్ఐపీ'ల దేశంగా మారుతోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన తాజా గణాంకాలే దీనికి నిదర్శనం. మార్చి 2026 నాటికి దేశంలో ఎస్ఐపీ పెట్టుబడులు రూ. 32,087 కోట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా మదుపర్లు ఈక్విటీ ఫండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే.. ఒకసారి ఎస్ఐపీ మొదలుపెట్టాక, ఏళ్ల తరబడి అదే మొత్తాన్ని కొనసాగిస్తుంటారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని (Inflation) తట్టుకోవాలంటే, మీ పెట్టుబడి కూడా ఏటా కొంత పెరగాలి. దీనినే 'స్టెప్-అప్ ఎస్ఐపీ' అంటారు.

మీరు నెలకు రూ. 5,000 పెట్టుబడి పెడుతున్నారనుకుందాం. దీనిని 12% వార్షిక రాబడితో 25 ఏళ్ల పాటు కొనసాగిస్తే వచ్చే ఫలితానికి, అదే పెట్టుబడిని ఏటా కేవలం 2% పెంచితే...