Srisailam Water Level : శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద - నీటిమట్టం వివరాలు ఇలా
భారతదేశం, సెప్టెంబర్ 1 -- Srisailam Water Level : ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద నీటి ప్రవాహం స్వల్పంగా పుంజుకుంది. మంగళవారం(సెప్టెంబర్ 1) ఉదయం నమోదైన వివరాల ప్రకారం జలాశయానికి 13,544 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వచ్చి చేరుతోంది.
వరద ప్రవాహం పెరుగుతుండటంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 871.801 అడుగులకు చేరింది. ఇక జలాశయంలో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 149.419 టీఎంసీలుగా నమోదైనట్లు ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.
మరోవైపు శ్రీశైలం నుంచి దిగువకు ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నుంచి వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కాలువల ద్వారా 13,111 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాల సూచనలు ఉన్నందున రానున్న గంటల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.