భారతదేశం, మే 29 -- Srisailam VIP Break Darshan Cancelled : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామివారి దివ్యధామంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో దేశం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ అసాధారణ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పించేందుకు దేవస్థానం యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.

శుక్రవారం (మే 29) నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నాలుగు రోజుల పాటు కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే అత్యంత ప్రముఖులకు మాత్రమే నిబంధనల ప్రకారం దర్శన సౌకర్యం ఉంటుంది. మ...