భారతదేశం, ఆగస్టు 28 -- Srisailam Dam Water Level : తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం. మరోవైపు విద్యుదుత్పత్తితో పాటు వివిధ సాగునీటి అవసరాల కోసం దిగువకు నిరంతరం నీటిని తోడేస్తుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పడిపోతోంది.

అధికారుల సమాచారం ప్రకారం ఇవాళ(ఆగస్ట్ 28, 2026) ఉదయం 8:45 గంటల సమయానికి శ్రీశైలం వద్ద నమోదైన ప్రధాన వివరాలు..

జలాశయంలో నీటి నిల్వ తగ్గడానికి ప్రధాన కారణం ఔట్‌ఫ్లో ఎక్కువగా ఉండటమే. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం (SLBHES) ద్వారా తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ నీటిని విడుదల చేస్తోంది. దీనికి తోడు శ్రీశైలం ఆధారిత వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా నిరంతరం నీటిని పంపింగ్ చేస్తున్నా...