భారతదేశం, జూలై 3 -- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో యంగ్ సెన్సేషన్ టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న, దివంగత రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ 'శ్రీనివాస మంగాపురం'. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జులై 30న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఈ జులై నెలఖారులో పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఏవీ బాక్సాఫీస్ బరిలో లేవు. ఒక డెబ్యూ హీరోకి సోలో రిలీజ్ డేట్ దొరకడం అనేది కచ్చితంగా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో సినిమా మీద ఆడియన్స్ లో బజ్ మరింత పెంచడానికి మేకర్స్ గట్టిగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అగ్రెసివ్ మార్కెటింగ్ తో యూత్ కు రీచ్ అయ్యేలా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, సుధ...