భారతదేశం, ఆగస్టు 25 -- Sri Gouri Priya About Success In Tamil Cinema: ఇటీవలే 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రంతో అలరించిన అందాల తెలుగు భామ శ్రీ గౌరీ ప్రియ. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన విషయం తెలిసిందే. రీసెంట్‌గానే చైన్నై లవ్ స్టోరీ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే, ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియ నటనకు మంచి గుర్తింపు లభించింది.

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకని దూసుకుపోతున్న ఈ చిన్నది అసలు మన సికింద్రాబాద్ అమ్మాయి. 2024లో వచ్చిన 'లవర్' (Lover) సినిమాతో తమిళంలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీ గౌరీ ప్రియ తన కెరీర్, భాషపై పట్టు సాధించిన తీరును మీడియా ద్వారా పంచుకుంది.

సొంతూరు సికింద్రాబాద్ కావడంతో చిన్నతనంలో తెలుగు, తమిళ సినిమాల మధ్య తేడా పెద్దగా తెలియకపోయేదని గౌరి చెప్పింది. "నేను చిన్నప్పుడు పాడిన అనేక హిట్ త...