భారతదేశం, జూలై 25 -- Sri Gauri Priya: యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story) బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో హీరోయిన్ గౌరి ప్రియ ఎమోషనల్ అయింది.

చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో తన తల్లిని గుర్తు చేసుకుని శ్రీ గౌరి ప్రియ ఎమోషనల్ అయింది. ''ఈ సక్సెస్ ను మా అమ్మ చూస్తే ఎంత బాగుండేదో అని అందరూ అంటున్నారు. అదొక్కటే బాధ. కానీ మా అమ్మ చూస్తోంది. ఇక్కడే ఎక్కడో ఉంది. అమ్మా.. నీ పెంపకానికి నేను పడే కష్టం ఇది'' అని ప్రియ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.

ఈ సక్సెస్ మీట్ లో గౌరి ప్రియ స్పీచ్ వీడియో వైరల్ గా మారింది. సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఇండస్ట్రీ నుంచి, స్నేహితుల నుంచి త...