భారతదేశం, ఏప్రిల్ 14 -- SRH vs RR IPL 2026 Highlights: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం (ఏప్రిల్ 13) జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుతంగా ప్రదర్శన చూపింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్‌లో పరుగులు, సిక్సర్ల మోతతోపాటు బౌలింగ్‌లో వికెట్ల వరదను పారించింది.

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ (RR) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ కావడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అయితే, ఆ తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

ట్రావిస్ హెడ్ (18) నెమ్మదించినా, ఇషాన్ కిషన్ మాత్రం రాజస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడారు. కేవలం 44 బంతుల్లోనే 91 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. జట్టు భారీ స్కోరు సాధించడానికి పునాది వేశారు. మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ (40)...