భారతదేశం, ఆగస్టు 8 -- Sreeleela Janhvi Kapoor: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లు ఒకే సినిమాలో స్క్రీన్ పంచుకోబోతుండటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఉత్తరాది, దక్షిణాది ఇండస్ట్రీలలో విశేష ప్రజాదరణ సొంతం చేసుకున్న జాన్వీ కపూర్, శ్రీలీల కలసి ఓ భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.

బాలాజీ మోషన్ పిక్చర్స్, సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు ఏక్తా కపూర్, ఆస్కార్ విజేత గునీత్ మోంగా కపూర్ ఈ వినూత్న చిత్రాన్ని నిర్మించనున్నారని తెలిసింది. 'పగ్లైట్', 'గ్యారా గ్యారా' వంటి విభిన్న కాన్సెప్ట్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఉమేష్ బిష్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం.

సాధారణంగా ఇద్దరు హీరోయిన్లు ఉన్న కథలు రొటీన్ ట్రయాంగిల్ ప్రేమకథలుగానే తెరకెక్కుతుంటాయి. కానీ...