భారతదేశం, మే 11 -- Sreeleela: దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యువ నటి శ్రీలీల.. తాజాగా చెన్నైలో జరిగిన అమృత ఏవియేషన్ కాలేజ్ ప్రెస్ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు. ఆ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. విద్యార్థులతో ముచ్చటిస్తూ తన జీవిత పాఠాలను పంచుకున్నారు. ఒక పక్క నటిగా, మరోపక్క మెడిసిన్ చదువుతున్న విద్యార్థిగా ఆమె పడుతున్న శ్రమను, ఆమె ఆలోచనా దృక్పథాన్ని ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా లేడీ సూపర్ స్టార్ అని తనను పిలవడాన్ని సున్నితంగా తిరస్కరించారు.

సాధారణంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతారను అందరూ లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. కానీ ఈ ఈవెంట్ లో హోస్ట్.. శ్రీలీలను లేడీ సూపర్ స్టార్ అని, సౌత్ సూపర్ స్టార్ అని పిలిచారు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. అసలు లేడీ సూపర్ స్టార్ నయనతారే...