భారతదేశం, ఏప్రిల్ 29 -- Spirit Movie: సినిమా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని, రంగుల ప్రపంచంలో తమ ముద్ర వేయాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ ఆ కలలను నిజం చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు. ముఖ్యంగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి సినిమా నిర్మించడం అనేది ఆషామాషీ విషయం కాదు.

అయితే "మనసుంటే మార్గం ఉంటుంది" అని నిరూపించారు చిన్నబోయిన రైతు నర్సమ్మ. గొర్రెలు కాచుకుంటూ జీవనం సాగించే ఆమె.. తన కొడుకును వెండితెరపై చూడాలన్న ఏకైక లక్ష్యంతో ఏకంగా రూ. కోటి వెచ్చించి 'స్పిరిట్' అనే చిత్రాన్ని నిర్మించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

నర్సమ్మ, వెంకటేశ్వర్లు దంపతులు వ్యవసాయం, గొర్రెలు కాచుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటారు. తన కొడుకును నటుడిగా మార్చాలన్న కోరికతో నర్సమ్మ తనకున్న గొర్రెలను విక్రయించి, ఆ వచ్చిన సొమ్మును సినిమా ని...