భారతదేశం, నవంబర్ 28 -- Sandeep Reddy Vanga About Prabhas Spirit Movie: తెలుగు సినీ పరిశ్రమ నుంచి వెళ్లి బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి వార్తల్లో నిలిచారు. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఆయన, తన సినిమాల్లో ఉండే తీవ్రత, అనూహ్య మలుపులపై మనసు విప్పి మాట్లాడారు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' చిత్రాన్ని రూపొందిస్తున్న సందీప్ రెడ్డి వంగా.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలే తన కథలకు బలమని వెల్లడించారు.

ప్రతి సినిమాతో ప్రేక్షకులను విస్మయానికి గురిచేయడం వెనుక ఉన్న రహస్యాన్ని సందీప్ రెడ్డి వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఫరీదూన్ షహర్యార్ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ తన రచనా శైలిని ఆయన వివరించా...