భారతదేశం, ఆగస్టు 5 -- Spider Man Leak: ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తున్న 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. బాక్సాఫీస్ దగ్గర కేవలం 6 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9,500 కోట్లకు పైగా) మార్కును దాటేసిన ఈ మార్వెల్ బ్లాక్‌బస్టర్ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. పైరసీ కాపీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో మార్వెల్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పైరసీ వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ కావడమే కాకుండా కేవలం 4 గంటల్లోనే దాదాపు 8 లక్షల వ్యూస్ దక్కించుకుంది. అయితే పైరసీని ప్రోత్సహించే వారిపై సాధారణ నెటిజన్లు, స్పైడర్‌మ్యాన్ డైహార్డ్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

"ఇది కాపీరైట్ చట్టాల ఉల్లంఘన.. లీక...