భారతదేశం, ఆగస్టు 17 -- Spider Man Box Office: హాలీవుడ్ యంగ్ స్టార్ టామ్ హాలాండ్ నటించిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు $2.02 బిలియన్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 19 వేల కోట్లకు పైగా) గ్రాస్ వసూలు చేసి ఎలైట్ $2 బిలియన్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది.

డైరెక్టర్ డెస్టిన్ డేనియల్ క్రెటన్ తెరకెక్కించిన ఈ సూపర్‌హీరో డ్రామా కేవలం మూడు వీకెండ్స్‌లోనే $2 బిలియన్ మార్కును దాటేసింది. 'అవెంజర్స్: ఎండ్ గేమ్' తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా నిలిచింది.

సోలో సూపర్‌హీరో మూవీగా $2 బిలియన్ దాటిన మొదటి చిత్రంగా 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' $1.9 బిలియన్ వసూలు చేసినా చైనాలో రిలీజ్ క...