భారతదేశం, ఆగస్టు 12 -- Sambalpur to Charlapalli Special Train : పండగలు, సెలవుల వేళ రైళ్లలో పెరిగిన ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలోని సంబల్‌పూర్ నుంచి హైదరాబాద్‌లోని చర్లపల్లి టెర్మినల్ వరకు ప్రత్యేక వన్‌వే స్పెషల్ రైలును నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసింది.

రైలు నంబరు 08309 (సంబల్‌పూర్ - చర్లపల్లి) వన్‌వే స్పెషల్ రైలు ఆగస్టు 14వ తేదీ శుక్రవారం నాడు సంబల్‌పూర్ స్టేషన్ నుంచి ఉదయం 11:45 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు (శనివారం) ఉదయం 11:30 గంటలకు చార్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ ప్రత్యేక రైలుకు కీలకమైన స్టేషన్లలో ఆగుతుంది.

ఈ వన్‌వే ప్రత్యేక రైలులో ప్రయాణికుల వసతి కోసం స్లీపర్ క...