భారతదేశం, అక్టోబర్ 26 -- పండగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ తీర రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల ఇబ్బందులను తొలగించి... వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు పార్వతీపురం - ఏక్తా నగర్ (గుజరాత్) స్టేషన్ల మధ్య ప్రత్యేక ఆన్-డిమాండ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 28న (బుధవారం) మధ్యాహ్నం 15:00 గంటలకు పార్వతీపురంలో బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 16:50 గంటలకు విజయనగరం చేరుకుని, 17:00 గంటలకు ముందుకు సాగుతుంది. అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10:00 గంటలకు ఈ రైలు ఏక్తా నగర్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ రైలు నవంబర్ 01న (ఆదివారం) రాత్రి 23:30 గంటలకు ఏక్తా నగర్‌లో బయలుదేరుతుంది. నవంబర్ 03వ తేదీ మధ్యాహ్నం 14:45 గంటలకు విజయనగరం చేరుకుని 14:50 కి బయలుదే...